● ఇజ్రాయిల్ నుంచి ఇండియాకు రూ.1.50 లక్షలు
● సాధారణ రోజుల్లో
రూ.30 వేలలోపు
టికెట్ ధర
● జోర్డాన్ మీదుగా
పంపించేందుకు
భారీ మొత్తంలో
చార్జీల వసూలు
● తమపై తీవ్ర భారం
పడుతోందని వలస
కార్మికుల ఆవేదన
మోర్తాడ్(బాల్కొండ): యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయిల్ నుంచి స్వదేశానికి వచ్చేయాలని అనుకుంటున్న వలస కార్మికులకు విమాన టికెట్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో రూ.30 వేలలోపు ఉన్న టికెట్ ధర ఏకంగా రూ.1.50 లక్షలకు చేరిందని వలస కార్మికులు వాపోతున్నారు. ఇజ్రాయిల్ నుంచి విమానాలను నిలపివేయడంతో రోడ్డు, జలమార్గంలో జోర్డాన్‌కు ట్రావెల్స్ సంస్థలు వలస కార్మికులను తరలిస్తున్నాయి. అక్కడి నుంచి ముంబైకి రూ.1.50లక్షలతో విమాన టికెట్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఓ వైపు యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతుండగా, మరోవైపు తాము ఇంటికి రాలేక పోతున్నామని వలస కార్మికులు అంటున్నారు.
దుబాయి నుంచి..
దుబాయి నుంచి హైదరాబాద్‌కు విమాన టికె ట్ సాధారణ రోజుల్లో రూ.9వేల నుంచి రూ. 10వేలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.30 వేల నుంచి రూ.40వేలకు పెరిగింది. కువైట్, బహ్రెయిన్‌ల నుంచి వచ్చే అవకాశం లేకపోవడంతో కొందరు దుబాయ్‌కి రోడ్డు మార్గంలో వెళ్లి ఇంటికి వచ్చే ఆలోచన చేస్తున్నారు. అయితే అక్కడి నుంచి కూడా అత్యధికంగా విమాన చార్జీలు వసూలు చేస్తుండటంతో వలస కార్మికులు బెంబెలెత్తిపోతున్నారు. విదేశాంగ శాఖ స్పందించి తమను సురక్షితంగా రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని వలస కార్మికులు కోరుతున్నారు.


