వివాహేతర సంబంధం.. ప్రేమ జంట దారుణ హత్య | Extra Marital Affair: Love Couple Murder At Adilabad Seethagondi | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. అదిలాబాద్‌లో ప్రేమ జంట దారుణ హత్య

Apr 30 2023 8:10 PM | Updated on May 1 2023 10:48 AM

Extra Marital Affair: Love Couple Murder At Adilabad Seethagondi - Sakshi

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. ఓ యువకుడు, వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. అదిలాబాద్‌ జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. జంట హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

గుడిహత్నూర్ మండలం సీతగోంది గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో ప్రేమ జంట విగతజీవులుగా కనిపించారు. మృతులను ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన మహ్మద్‌ రఫిక్‌, అశ్వినిగా గుర్తించారు. రెండు రోజుల క్రితం హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి.. హత్య జరిగిన తీరును పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరీ దారుణానికి పాల్పడింది, హత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కీలక ఆధారాలు లభ్యం
ప్రేమ జంట హత్యలో కీలకమైన ఆదారాలు లభ్యమయ్యాయి. హత్యకు గురైన జంట అంతకుముందు స్కూటీపై బయటకు వెళుతున్న దృశ్యాలు రోడ్డుపై ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.  మహ్మమద్  రఫిక్‌  బైక్  నడుపుతుండగా వివాహిత వెనక కూర్చొని ఉంది. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఇద్దరు హత్యకు గురయ్యారు.

అదేవిధంగా హత్య చేసిన వాళ్లకు సంబంధించిన అదారాలు కూడా లభ్యమయ్యాయి. కారులో వచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల కారు విజువల్స్‌ సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.  దీని ఆధారంగా విచారణ సాగిస్తున్నారు.

లొంగిపోయిన భర్త!
ఇదిలా ఉండగా ప్రేమ జంట హత్య కేసులో అశ్విని భర్త రమేష్‌ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. భార్య వివాహేతర సంబంధం నచ్చని కారణంతో ఆమెను, తన ప్రియున్ని హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని హత్యకు గురైన రఫిక్‌ కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.
చదవండి: పరిస్థితి భయంకరం.. ఊపిరి తీసుకోరాలేదు.. ఎక్కడివాళ్లక్కడ పడిపోయారు

Advertisement
 
Advertisement
Advertisement