తల్లి కర్మకాండలకు వెళ్లొస్తూ.. | Car accident in ysr distrct | Sakshi
Sakshi News home page

తల్లి కర్మకాండలకు వెళ్లొస్తూ..

Aug 21 2023 3:24 AM | Updated on Aug 21 2023 3:24 AM

Car accident in ysr distrct - Sakshi

చెన్నూరు:  తల్లి కర్మకాండలకు వెళ్లి తిరిగి వస్తూ కొడుకు, అతని కుమారుడు, అత్త దుర్మరణం చెందగా, భార్య, కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఘటన వైఎస్సార్‌ జిల్లా చెన్నూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కడప–కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... తెలంగాణ రాష్ట్రం ఖైరతాబాద్‌ ప్రాంతంలో నివాసం ఉండే కొండేటి కృష్ణ­(48) తన తల్లి కర్మకాండల నిమిత్తం భార్య విజ­య­రాణి, కుమార్తె నిహారిక, కుమారుడు రిషి(15), అత్త అన్నే పద్మావతితో కలిసి తిరుపతి వెళ్లారు.

కర్మకాండల కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి తన కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. చెన్నూరు ఆంధ్ర స్పైస్‌ సమీపానికి రాగా­నే ఒక్కసారిగా కారు అదుపు తప్పి వేగంగా వెళ్లి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కృష్ణ, పద్మావతి, రిషి అక్కడికక్కడే మృతి చెందగా, విజయరాణి, నిహారికలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చెన్నూరు ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement