భార్య ఊరికి వెళ్లగానే ఇంటికి పిలిపించుకుని.. | Boyfriend Killed Lover With Beer Bottle And Escape in Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Aug 11 2020 7:22 AM | Updated on Aug 11 2020 7:22 AM

Boyfriend Killed Lover With Beer Bottle And Escape in Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఉప్పల్‌: వివాహేతర సంబంధం ఓ మహిళ  హత్యకు దారి తీసింది.  ఉప్పల్‌  సీఐ రంగస్వామి తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం మూసిపట్ల గ్రామానికి చెందిన డి.అంజయ్య(30) చిలుకానగర్‌లో ఉంటూ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి భార్య 18 ¯ðనెలల కుమారుడిని తీసుకొని తల్లిగారింటికి వెళ్లింది. అంజయ్యకు నాచారం ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి రేణుక(30)తో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉంది. భార్య ఊరికి వెళ్లగానే  ఆదివారం రాత్రి అంజయ్య రేణుకను తన గదికి తెచ్చుకున్నాడు.

రాత్రి మద్యం తాగిన తర్వాత  రేణుక తన అవసరం నిమిత్తం డబ్బులు కావాలని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన అంజయ్య ఖాళీ బీరు సీసాతో రేణుకను కొట్టడంతో తల పగిలింది. వెంటనే కాలుతో మెడపై నొక్కి హత్య చేసి పారిపోయాడు. మృతురాలికి 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.  కర్ణాటక ప్రాంతానికి చెందిన రేణుక భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి ఉంటోంది. సోమవారం ఉదయం స్థానికులు సమాచారం ఇవ్వడంతో  ఉప్పల్‌ సీఐ రంగస్వామి, ఎస్‌ఐ మైబెల్లి ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement