కారు, ఆటో ఢీ... ముగ్గురి దుర్మరణం

Accident in Prakasam district - Sakshi

ప్రకాశం జిల్లాలో ఘటన   

ఇద్దరు రైతులు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మృతి

బేస్తవారిపేట: నిద్రమత్తులో  కారు... ఆటోను ఢీకొట్టి న ఘటనలో ఇద్దరు రైతులు, సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ షేక్‌ ఖాశీంషా, కారులోని బైనగాని ఓబయ్య, గురవయ్య తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే... బేస్తవారిపేట మండలంలోని ప్రకాశం జిల్లా, బార్లకుంటకు చెందిన చిత్తా­రు వెంకటేశ్వర్లు (53), చిత్తారు రాములు (40), బిళ్ల చిన్నవెంకటేశ్వర నాయుడు కలిసి ఎండుమిర్చి పంటను అమ్ముకునేందుకు గుంటూరు మిర్చియార్డుకు వెళా­్లరు. విక్రయించిన సొమ్ముతో గుంటూరులో రై­లు ఎక్కారు. కంభంలో దిగాల్సి ఉండగా, నిద్రపోవ­డంతో గిద్దలూరులో దిగారు. అక్కడ నుంచి బేస్తవా­రి­పేటకు వచ్చేందుకు ఆటో ఎక్కారు.

మరోవైపు విజ­యవాడలో కొత్తగా కొనుగోలు చేసిన కారును తీసు­కుని తండ్రీకొడుకులు ఓబయ్య, గురవయ్య వెళుతూ మార్గమధ్యంలో నిద్రమత్తులో పూసలపాడు వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. అందులో ఇరుక్కుపోయిన ముగ్గురిలో వెంకటేశ్వర్లును రోడ్డుపై వెళ్లే వాహనదారులు బయటకు తీశారు. ఆ సమయానికే అతడు మృత్యువాత పడ్డాడు. రాములు, చినవెంకటేశ్వర నా­యుడు ఆటోలో చిక్కుకుపోయారు.

ఈలోగా లీకైన ఆయిల్‌ ట్యాంక్‌ నుంచి మంటలు వ్యాపించడంతో ఇద్దరి శరీరాలు కాలిపోయాయి. వారి వద్ద మిర్చి పంట విక్రయించిన సొమ్ము రూ.10లక్షలు కాలి బూడిదైపోయాయి. మృతుడు చిన్న వెంకటేశ్వర నాయుడు సీఎస్‌పురం మండలం, నల్లమడుగుల సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

whatsapp channel

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top