Hyderabad: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్‌ | 6-Year-Old Girl Kidnapped In Hyderabad Abids, Rescued By Police In Hours | Sakshi
Sakshi News home page

Hyderabad: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్‌

Aug 4 2024 7:27 AM | Updated on Aug 4 2024 7:24 PM

6-Year-Old Girl Kidnapped In Hyderabad

అబిడ్స్‌: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైన ఘటన అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బేగంబజార్‌ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన సోదరుడి కుమార్తె ప్రగతిని తీసుకొని శనివారం మధ్యాహ్నం కట్టెలమండిలోని పుట్టింటికి వచ్చింది. కాసేపటి తర్వాత ప్రగతి కట్టెలమండి ముత్యాలమ్మ ఆలయం ముందు ఆడుకుంటాన్నంటూ బయటకు వెళ్లింది. ఆమెతో పాటు ప్రియాంక సోదరి కుమారుడైన రుత్విక్‌ కూడా వెళ్లాడు. 

రుత్విక్ ఒక్కడే ఇంటికి రాగా ప్రగతి కనిపించలేదు. వెంటనే కుటుంబ సభ్యులు బాలిక కోసం పరిసరాల్లో గాలించి అబిడ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు రాత్రి వేళ బాలిక కిడ్నాప్‌ అయ్యిందని గుర్తించారు.ప్రగతిని ఓ గుర్తుతెలియని వ్యక్తి నడుచుకుంటూ వెంట తీసుకెళ్తున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.    

Advertisement
 
Advertisement
Advertisement