ప్రజాసేవే మా లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజాసేవే మా లక్ష్యం

Nov 1 2026 4:31 AM | Updated on Nov 1 2026 4:31 AM

కుప్పంరూరల్‌ : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్సీ భరత్‌ తెలిపారు. శనివారం కుప్పం రూరల్‌ మండలం మోట్లచేనులో ఎంపీటీసీ అభ్యర్థి కేశవన్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు అందజేసి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరా. ఎమ్మెల్సీ భరత్‌ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం గెలిచి మూడేళ్లు కావస్తున్నా పేద, బడుగు, బలహీనవర్గాలకు చేసింది ఏమీ లేదని, కేవలం స్వలాభం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. జనాలకు జలగల్లా పీల్చుకుతింటున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సౌమ్యులైన అభ్యర్థులను ఎంపిక చేశామని, వారిని గెలిస్తే ప్రజాసేవకే అంకితమవుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ హెచ్‌ఎం మురుగేష్‌, మల్లప్ప, సంజీవ్‌కుమార్‌, రంగస్వామి, రాఘవేంద్ర, చిన్నరాజు, పరమేశ్‌, రామ్మూర్తి, రామస్వామి, కనకరాజు, చిన్నతంబి, పరమేష్‌ పాల్గొన్నారు. అడవిబూదుగూరులో జెడ్పీటీసీ అభ్యర్థి వనితశీను, ఎంపీటీసీ అభ్యర్థి బాలకృష్ణ, నూలుకుంటలో ఎంపీటీసీ అభ్యర్థి ఈశ్వర్‌ ఇంటింటి ప్రచారం చేపట్టారు. హెచ్‌ఎం శీను, గౌరప్ప, జయకుమార్‌, కృష్ణన్‌, విజేంద్రన్‌, రమేష్‌, సిద్ధరాజులు, రాజేంద్రన్‌, రాజా, తన్నతంబి, రామన్‌, సిద్ధప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement