జిల్లా వ్యాప్తంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, పలమనేరు, కుప్పం, నగరి మున్సిపల్ ఎన్నికలు నవంబర్ 1 వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నందున ఓటర్లు జాగ్రత్తగా ఓట్లు వేయాల్సి ఉంటుంది. లేకుంటే ఓటు చెల్లకుండా పోయే ప్రమాదముంది. పోలింగ్ సిబ్బంది నిలువుగా మడిచి ఇచ్చిన బ్యాలెట్ పేపర్‌పై నచ్చిన అభ్యర్థి గుర్తుపై స్వస్తిక్ స్టాంప్ వేయాలి. ఆ తర్వాత బ్యాలెట్‌ను యథావిధిగా మడిచి బ్యాలెట్ బాక్స్‌లో వేయాలి. ఇలా కాకుండా బ్యాలెట్‌ను అడ్డంగా మడతపెడితే ఒక గుర్తుపై వేసిన స్టాంపు ఇంకు మరో గుర్తుపై అంటుకుని చెల్లుబాటు కాకుండా పోయే అవకాశం ఉంటుంది. అందుకే పోలింగ్ సిబ్బంది నిలువుగా మడిచి ఇచ్చిన బ్యాలెట్ పేపర్‌ను ఓటేసిన తర్వాత యధావిధిగా మడిచి బ్యాలెట్ బాక్స్‌లో వేస్తే ఓటు చెల్లుబాటు అవుతుంది. – చిత్తూరు కలెక్టరేట్
టిప్పర్ ఢీకొని
బాలుడికి గాయాలు
యాదమరి: చిత్తూరు– గుడియాత్తం రహదారిలో శనివారం సైకిల్‌పై వెళుతున్న బాలుడిని టిప్పర్ ఢీకొంది. చోటుచేసుకుంది. వివరాలు.. షికారికాలనీకి చెందిన గోపి కుమారుడు విశాల్ తనకు అన్న వరసైన వ్యక్తితో సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన విశాల్‌ను చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్‌ఐని సంప్రదించగా తనకు సమాచారం లేదని చిత్తూరు కార్పొరేషన్ విధుల్లో ఉన్నట్లు సమాధానమిచ్చారు. అనంతరం యాదమరి పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేయగా వారు స్పందించకపోవడం గమనార్హం. ప్రమాదానికి కారణమైన టిప్పర్ అధికార పార్టీ నేతకు చెందినదని, కేను మాఫీ చేసేందుకు బాధితులతో రాజీ కుదిర్చే పనికి లోపాయికారీగా పోలీసులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శ్రీవారి దర్శనానికి
8 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టిక్కెట్లు లేని వారికి 8 గంటల సమయం పడుతోంది.


