అదనపు నిధులకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

అదనపు నిధులకు డిమాండ్‌

Nov 1 2026 4:55 AM | Updated on Nov 1 2026 4:55 AM

● వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ● స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం జోరు

చిత్తూరు కలెక్టరేట్‌ : స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే కేటాయించిన బడ్జెట్‌లోనే అన్ని ఖర్చులు భరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని, అదనపు నిధులు విడుదల చేయాలని వైఎస్సార్‌ టీచర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రెడ్డిశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని కోరారు. అదనపు నిధులు కేటాయించబడదని ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం దారుణమన్నారు. నిధుల కొరత సాకుతో ఎన్నికల అధికారులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో పారితోషికం ఇవ్వకుండా వాయిదా వేసే ప్రమాదముందని హెచ్చరించారు.

ఓటమి భయంతోనే

కుట్రలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): అధికార కూటమి నేతలు ఓటమి భయంతోనే కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి దుయ్యబట్టారు. చిత్తూరు మండలం అనంతాపురం, పచ్చనపల్లి, ముత్తుకూరు, తాళంబేడు సెగ్మెంట్లలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. విజయానందరెడ్డి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌బాబు, జెడ్పీటీసీ అభ్యర్థి జయంతి, ఎంపీటీసీ అభ్యర్థులు సుమతి, మురగయ్య, జీవనజ్యోతి, రాజేష్‌లతో పాటు ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈసందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటిస్తుంటే గెలిచేది వైఎస్సార్‌సీపీ అని ప్రజలే చెప్తున్నారన్నారు. టీడీపీ గెలుస్తుందని ఆ పార్టీ కార్యకర్తలకే నమ్మకం లేదన్నారు. అధికార పార్టీ, యంత్రాంగం ఎంత భయపెట్టినా, ప్రలోభాలకు గురి చేసినా వెన్ను చూపకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అన్ని ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయడమే తమకు తొలి విజయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎంఎస్‌ బాబు నాయుడు, నాయకులు సంపత్‌, అమర్‌నాథరెడ్డి, త్యాగరాజులు భాస్కర్‌నాయుడు, రంజన్‌, రాజా, స్టాండ్లీ, కన్నన్‌, దిలీప్‌, భాస్కర్‌, పి.బాబు, శ్యామ్‌, గురుమూర్తి, పట్టాభి, జయచంద్ర, రాజేంద్ర తదితరులు న్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement