చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం పచ్చనపల్లికి చెందిన మాజీ సర్పంచ్ కుమారుడు మూర్తి వైఎస్సార్‌సీపీలో చేరారు. మూర్తికి నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండున్నర ఏళ్ల కూటమి పాలన అస్థవ్యస్తంగా ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పేదల ప్రజలకు మోసం చేశారని ఈసందర్భంగా మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌బాబు, నాయకులు సంపత్, అమర్‌నాథరెడ్డి, త్యాగరాజులు, భాస్కర్, శ్యామ్, బాబు తదితరులున్నారు.


