● ఒక కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు ● పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత.. వెబ్‌ క్యాస్టింగ్‌ ● ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌ ● 3న కౌంటింగ్‌కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

● ఒక కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు ● పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత.. వెబ్‌ క్యాస్టింగ్‌ ● ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌ ● 3న కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

Nov 1 2026 4:31 AM | Updated on Nov 1 2026 4:31 AM

● ఒక కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు ● పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత.. వెబ్‌ క్యాస్టింగ్‌ ● ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌ ● 3న కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

సాక్షి, చిత్తూరు : చిత్తూరు కార్పొరేషన్‌, పలమనేరు, కుప్పం, నగరి పురపాలక సంఘాల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 5 గంటల్లోపు ఎవరైతే ఓటు వేయడానికి క్యూలో ఉంటారో, వాళ్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా జిల్లాలో 76 పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా, 133 సమస్యాత్మకంగా గుర్తించారు. కేవలం ఇక్కడ మాత్రమే 1.45 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మళ్లీ ఈ కేంద్రాల వద్ద సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు శాఖ ప్రత్యేక బలగాలను మొహరించింది. ఇక పోలింగ్‌ సామగ్రిని శుక్రవారం జిల్లాలోని ఆయా పోలింగ్‌ బూత్‌లకు తరలించారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరచనున్నారు. ఇందుకోసం చిత్తూరు, పలమనేరు, కుప్పంలోని కొన్ని విద్యా సంస్థలకు ఎంపిక చేశారు. నగరి మున్సిపాలిటీ సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను మాత్రం పుత్తూరులో భద్రపరచనున్నారు. ఈనెల 3వ తేదీన ఓట్లను లెక్కించి, విజేతలను ప్రకటించనున్నారు.

ప్రజల వైపు నిలబడిన వైఎస్సార్‌సీపీ

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఓటరు నాడిని పట్టేందుకు ఎవరి అంచనాల్లో వాళ్లున్నారు. నామినేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి ఉపసంహరణ వరకు టీడీపీ గూండాలు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా రిటర్నింగ్‌ అధికారులనే ప్రలోభాలకు గురిచేసి నగరి ముమున్సిపల్‌ చైర్మన్‌తో పాటు 4 వార్డులు, చిత్తూరులో 51 డివిజన్లు, కుప్పంలో 13, పలమనేరులో 6 వార్డులను ఏకగ్రీవం చేసుకున్న సంగతి విధితమే. మిగిలిన 94 వార్డులతో పాటు చిత్తూరు మేయర్‌, కుప్పం, పలమనేరు చైర్‌పర్సన్ల స్థానానికి ప్రత్యక్ష పద్దతిలో ఓటు వేసి ప్రజలు ఎన్నుకోవాల్సి ఉంది. అధికారపార్టీ ఆగడాలను చూసిన ప్రజలు ఇప్పటికే విసిగిపోయి, ఎవరివైపు నిలబడాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. పోయిన పరువు నిలబెట్టుకోవడానికి పోలింగ్‌ రోజు గొడవలు సృష్టించి, ప్రజాతీర్పును మార్చడానికి కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల వైపు నిలబడి, పట్టు సాధించడానికి వైఎస్సార్‌సీపీ గట్టిగానే యుద్ధం చేయడానికి నిర్ణయించుకుంది.

పురపోరు కీలక ఘట్టానికి చేరుకుంది. నేడే అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. జిల్లాలోని

ఓ కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీల్లో ఉదయం 7 నుంచి పోలింగ్‌ మొదలుకానుంది. సాయంత్రం 5 గంటలకు

ఓటింగ్‌ ముగియనుంది. ఈ మేరకు ఎన్నికల్లో మొత్తం 2.79 లక్షల మందికి పైగా ఓటు హక్కును

వినియోగించుకోనున్నారు. ప్రశాంతవాతావరణంలో ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement