అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తత అవసరం

Nov 1 2026 4:31 AM | Updated on Nov 1 2026 4:31 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ప్రజాస్వామ్య భద్రత పోలీసుల చేతుల్లోనే ఉందని, ఈ క్రమంలో అప్రమత్తత అవసరమని, సమష్టిగా విధులు నిర్వర్తించి మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను ప్రశాంతంగా ముగించాలని అడిషనల్‌ ఎస్పీ మహబూబ్‌బాషా ఆదేశించారు. ఆదివారం మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ బందోబస్తుకు వెళుతున్న పోలీసు అధికారులు, రూట్‌ ఆఫీసర్లు, సిబ్బందికి శనివారం చిత్తూరు నగరంలో నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. అడిషనల్‌ ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్‌ రోజున సిబ్బంది పాటించాల్సిన విధివిధానాలు, చేయాల్సినవి, చేయకూడని అంశాలను వివరించారు. లొకేషన్‌ బందోబస్తు సిబ్బంది నుంచి, మొబైల్‌ పార్టీలు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, క్యూఆర్టీ, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ బృందాల వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తే సూచనలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్పీ వెంకటనారాయణ మాట్లాడుతూ పోలింగ్‌ విధుల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, క్యూలను సక్రమంగా నిర్వహించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రిసైడింగ్‌ అధికారి అనుమతి లేకుండా బందోబస్తు సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్‌ స్టేషన్ల లోపలికి వెళ్లకూడదని స్పష్టం చేశారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరుకునే వరకు పటిష్టమైన భద్రత కల్పించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement