చిత్తూరు కలెక్టరేట్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.29,833.18 కోట్లు కేటాయించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దళిత, గిరిజన వాడల్లో అభివృద్ధి కనిపించడం లేదని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, ఏఐడీఆర్‌ఎమ్ జాతీ య కమిటీ సభ్యుడు నాగరాజులు ఆవేదన వ్యక్తం చేశా రు. సోమవారం ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పక్కాగా అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదు ట ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ సబ్ ప్లాన్ నిధులను ఇతర శాఖలకు దారిమళ్లించకుండా పూర్తిస్థాయిలో మౌలిక వసతులకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, వీధిదీపాలు, శ్మశానవాటికల ఏర్పాటుతోపాటు అర్హులందరికీ ఇంటిస్థలాలు మంజూరు చేయా లని కోరారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వ హించే పిజిఆర్‌ఎస్ తరహాలోనే ఎస్సీ, ఎస్టీ, ఆదివా సీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజా ఫిర్యాదు ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశా రు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్లతో సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రరంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరా రు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు వర్తింపజేసి ఫీజు మినహాయింపు ఇవ్వాలన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని స్పష్టం చేశా రు. నేతలు దాసరి చంద్ర, రామమూర్తి, మారాన్ రమే ష్, రాము, గజేంద్రబాబు, కుమార్, జ్యోతి, గురు స్వామి, కవిత, మల్లిక, ఆనందమ్మ, గోవిందస్వామి, మోహన్, జలంధరన్, కుట్టి పాల్గొన్నారు.


