కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వా మివారి ఆలయంలో హుండీ లెక్కింపును సోమ వారం చేపట్టారు. 19 రోజులకు గాను మొత్తం రూ. 1,47,12,236 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే స్వామివారికి 67 గ్రాముల బంగారం, 220 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు కానుకలుగా సమ ర్పించినట్లు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ మణి నాయుడు, ఏఈఓలు కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, సీఎఫ్‌ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
నేనింతే.. ఫోన్ తీయను!
గుడిపాల: గుడిపాల మండలంలోని ఉపాధిహామీ ఏపీఓ ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయ రు. దీనిపై ప్రశ్నిస్తే నేనింతే.. ఫోన్ తీయను అంటూ దురుసుగా సమాధానం చెబుతుంటారు. మండలంలోని గట్రాళ్లమిట్ట పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ అవకతవకలకు పాల్పడిందని కూలీలు, రైతులు గతంలో పీజీఆర్‌ఎస్ ద్వారా కలెక్టర్‌కు విన్నవించారు. అలాగే ఎంపీడీఓకు సైతం ఫిర్యా దు చేశారు. ఈ విషయంపై సంబంధిత ఏపీఓతో మాట్లాడాలని అధికారులు సూచించారు.ఈ విష యంపై ఏపీఓకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయ డం లేదని గ్రామస్తులు మళ్లీ ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీడీఓ సైతం ఏపీఓను పిలిపించి ఫోన్ తీయకుంటే సమస్య ఎలా తెలుసుకుంటావు అంటూ మందలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో సోమవారం గట్రాళ్లమిట్ట పంచాయతీలో చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించి అవినీతిపై గ్రామస్తులు నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీఓకు సమాచారం అందిద్దామనుకుంటే ఫోన్ తీయడం లేదని తెలిపారు. దీనిపై ఆగ్రహించిన కలెక్టర్ వెంటనే అవినీతిపై నివేదిక అందించాలని ఉపాధిహామీ పీడీని ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉపాధిహామీ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. రైతులు ఫోన్ చేస్తే ఎందుకు తీయడం లేదని ఏపీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన అవకతవకలపై నివేదిక ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు.


