శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు

Aug 25 2026 1:57 AM | Updated on Aug 25 2026 1:57 AM

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం శాస్త్రోక్తంగా పవి త్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జయవిజయులకు, గరుడాళ్వారుకు, వరదరాజస్వామివారికి, వకుళమాత అమ్మవారికి, ఆనంద నిలయం, యాగశాల, విష్వక్సేనులవారికి, యోగనరసింహస్వామి వారికి, భాష్యకార్లకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీభూవరాహస్వామి వారికి, బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూ దేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలు గు మాడ వీధుల్లో విహరిస్తూ కనువిందు చేశారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించా రు. తిరుమల పెద్ద జీయర్‌ స్వామి, చిన్న జీయర్‌ స్వామి, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement