– 8లో
ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది. దీంతో దస్తావేజు లేఖరులు ఉపాధి కోల్పోనున్నారు.
మహిళపై దాడిచేసిన వారిని
ఎన్‌కౌంటర్ చేయాలి
వెదురుకుప్పం : మహిళలపై దాడి చేసిన వారిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం వెదురుకుప్పం మండలంలోని పచ్చికాపలంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మహిళలు, చిన్నారులు, విద్యార్థులపై దాడు లు, అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. గుంటూరులో స్థానిక టీడీపీ నాయకుడు మల్లెల వెంకటరమణమూర్తి ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి అమానుషంగా దాడి చేశాడని తెలిపారు. బాధితురాలు రెండు రోజుల క్రితం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండి పడ్డారు. పోలీసులు టీడీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత పోలీసులు టీడీపీ నాయకుడిపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడం సభ్యసమాజానికి సిగ్గుచేటన్నారు. ఆడబిడ్డకు అన్యా యం జరిగితే అక్కడ నేను ఉంటా అని ఉపన్యాసాలు ఇచ్చే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మీరు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై వివక్ష ఎక్కువైందని, వారికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ జపం చేస్తున్న హోమ్ మంత్రి అనితమ్మకు మహిళలపై జరుగుతున్న దాడులు కనిపించలేదా లేదా అని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి, డిపూటీ సీఎం, హోమ్ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


