కార్వేటినగరం : ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసు లు పెట్ట, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించడం టీడీపీకి అలవాటుగా మారిందని మాజీ ఉప డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. శనివారం పుత్తూరులోని క్యాంపు కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు. మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన భాద్యత వైఎస్సార్‌సీపీపై ఉందన్నారు. తమ అభిప్రాయాలను మన యాప్ ద్వారా ప్రజలకు చేరవేయవచ్చన వెల్లడించారు. రాష్ట్రంలో 80 శాతం సామాజిక మాధ్యమాలు ఓ పార్టీ చేతిలో ఉన్నాయని, ప్రశ్నిస్తున్న గొంతుకలను నొక్కివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిర్మాణాలను టీడీఈ నేతలు కూల్చివేశారని ఆరోపించారు. పచ్చమూక అకృత్యాలపై పోరాడేందుకే సూపర్ యాప్‌ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ యాప్‌ను కార్యకర్తలందరూ డౌన్‌లోడ్ చేసుకుని తమ మొబైల్‌పోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, పద్మనాభరెడ్డి, విజయకుమార్ రెడ్డి, మణి, జెడ్పీటీసీ సభ్యులు సుకుమార్, అన్బళగన్, రైతు విభాగం కార్యదర్శి చందురాజు, నేతలు రామయ్య, శివాజీ, దూది మోహన్, గుణశేఖర్‌రెడ్డి, వెంకటేష్‌రెడ్డి, కిషోర్ రెడ్డి, లోకేష్‌రెడ్డి, కామ సాని లోకేష్ రెడ్డి, నవీన్, జయచంద్రారెడ్డి, ఉమాపతి, మదివన్నన్, సుందరరాజ్, గోపాల్, మునికృష్ణ, రఫీ, జనార్ధన్, కాళప్ప, గిరి, సతీష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
యాప్ పోస్టర్ ఆవిష్కరిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
పోస్టర్ ఆవిష్కరిస్తున్న మాజీమంత్రి ఆర్‌కే రోజా
కార్యకర్తలకు డిజిటల్ అండ
నగరి : వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు జగనన్న 2.0 సూపర్ యాప్ ఒక సమగ్ర డిజిటల్ వేదికగా, పార్టీ కార్యకలాపాలకు అండగా నిలుస్తుందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. శనివారం సాయంత్రం తన నివాస కార్యాలయం వద్ద జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ పార్టీ సమాచారం తెలుసుకోవడం నుంచి, ప్రజా సమస్యలను అధినాయకత్వానికి చేరవేయడం వరకు, సోషల్ మీడియా ప్రచారం నుంచి కార్యకర్తల రక్షణ వరకు అనేక సేవలను యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. యాప్‌లో పార్టీ అధికారిక ప్రకటనలు, ప్రత్యక్ష ప్రసారాలు, డిజిటల్ లైబ్రరీ, సర్వేలు, అభిప్రాయ సేకరణ వంటి అనేక విభాగాలు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా, పార్టీ కార్యకర్తలపై జరిగే వేధింపులు, దాడులు, అక్రమ కేసులు లేదా పోలీసు చర్యలకు సంబంధించిన వివరాలను డిజిటల్ బుక్ విభాగంలో నమోదు చేసుకునే అవకాశం కల్పించారని చెప్పారు. ఎంపీపీ భార్గవి, మాజీ ఎంపీపీ దీప, పుత్తూరు మున్సిపల్ మాజీ చైర్మన్ హరి, పార్టీ నగరి, పుత్తూరు మున్సిపల్ అధ్యక్షులు రమేష్‌రెడ్డి, ఏకాంబరం, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు సురేష్, వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌లాల్, వైస్ ఎంపీపీ కన్నియప్ప, పార్టీ జిల్లా సహ కార్యదర్శులు మురుగా, లీలారామ్, యువత అధ్యక్షుడు యువరాజ్ పాల్గొన్నారు.
జగన్ 2.0 పోస్టర్ విడుదల
కుప్పం : జగన్ 2.0 యాప్ పోస్టర్‌ను ఎమ్మెల్సీ భరత్ శనివారం ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం కోసమే యాప్‌ను జగనన్న తీసుకువచ్చారని తెలిపారు. యాప్‌ను ప్రతి ఒక్కరూ ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరారు. టీడీపీ నేతలు సృష్టించిన సమస్యలు, వేధింపులు, బెదిరింపులను ఈ యాప్‌లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. చట్టపరమైన కేసులకు సంబంధించి ఈ యాప్ ద్వారా సంబంధిత న్యాయవాది మీకు అందుబాటులోకి వస్తారని వెల్లడించారు. అలాగే పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఉంటుందని వివరించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు మురుగేష్, రామకృష్ణ, దండపాణి, బాబురెడ్డి, నితిన్‌రెడ్డి, మణి, చంద్రారెడ్డి, కృష్ణమూర్తి, ఈశ్వర్, మోహన్‌రామ్, మునిరాజు, శీను పాల్గొన్నారు.


