నగరి : రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా మండిపడ్డారు. శనివారం ఆమె మాట్లాడుతూ గుంటూరులో మహిళపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ, మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. పోలీసు వ్యవస్థ సమర్థవంతంగాగా పనిచేస్తుందా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని చెప్పారు. సాధారణమైన నీటి పైప్ కనెక్షన్ వివాదం నేపథ్యంలో టీడీపీ స్థానిక నేత, ఆయన కుటుంబీకులు ఒక మహిళపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు పట్టించుకోలేదని, ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తే సరిపోదని, నిందితులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశా లు వచ్చిన తర్వాతే పోలీసులు కేసులు నమోదు చేయాలా? లేక చట్టం తన పని తాను చేసుకోవా లా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రా జ్యాంగం అమలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వడమాలపేట మండలం ఏఎం పురంలో బాలికపై హత్యాచారం కేసును ప్రస్తా వించారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలవడం వల్లే నిందితుడికి జీవిత ఖైదు పడిందని, లేదంటే ఆ కేసు కూడా నిర్లకా్‌ష్య్‌నికి గురయ్యేదని స్పష్టం చేశారు. మహిళల భద్రతపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ఇలాంటి ఘటనలపై ఆయన స్పందించరా అని నిలదీశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘నీట్’గా 658వ ర్యాంక్
చిత్తూరు కలెక్టరేట్ : నీట్– 2026 ఫలితాలలో చిత్తూరుకు చెందిన పెరికెటి అనురాగ్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఆల్ ఇండియా స్థాయిలో 658 వ ర్యాంక్ సాధించారు. చిత్తూరు నగరంలోని ప్రశాంత్ నగర్‌కు చెందిన పి.రాజేంద్ర ప్రసాద్, మమతరాణి దంపతుల కుమారుడైన అనూరాగ్ సాధించిన ర్యాంకుపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 720 మార్కులకు గాను 666 మార్కులు సాధించడంపై అభినందనలు తెలియజేశారు. అనురాగ్ తొలి నుంచీ చదువులో ఉత్తమంగానే రాణించారు. మదనపల్లె శ్రీ చైతన్య పాఠశాలలో పదో తరగతి చదివి 600 మార్కుల కు 579 మార్కులు సాధించారు. విజయవాడ గోశాలలోని శ్రీ చైతన్య జూని యర్ కళాశాలలో ఇంటర్‌లో 976 మార్కులు పొందారు. తెలంగాణ ఈఏపీ సెట్‌లో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 56వ ర్యాంక్ కై వసం చేసుకోవడం విశేషం.


