పూతలపట్టు జెడ్పీ హైస్కూల్‌లో
విద్యార్థినుల అవస్థ
పిల్లలతో డేటా ఎంట్రీ చేయిస్తున్న
ఉపాధ్యాయులు
సిబ్బంది కొరత పేరుతో కుంటి సాకులు
మండిపడుతున్న తల్లిదండ్రులు
చదువును పక్కనపెట్టి..
పూతలపట్టు (యాదమరి) : పాఠశాలకు వెళ్లి బుద్ధి గా చదువుకోవాల్సిన విద్యార్థినులు.. అక్కడ ఉపాధ్యాయులు చేయాల్సిన పనులను తమ భుజాలపై వేసుకున్న ఘటన పూతలపట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వెలుగుచూసింది. గురువులు నిర్వర్తించాల్సిన రికార్డుల నమోదు ప్రక్రియను విద్యార్థినులే స్వయంగా సెల్ ఫోన్ల ముందు కూర్చు ని చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..?
ప్రభుత్వం సరఫరా చేసిన విద్యా మిత్ర కిట్లు అంటే పాఠ్యపుస్తకాలు, షూలు, యూనిఫామ్ వివరాలను బయోమెట్రిక్ విధానం ద్వారా ఆన్‌న్‌లైన్‌లో నమో దు చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులే దగ్గరుండి ఎస్‌ఆర్‌కే వీఏం యాప్‌లో ఈ వివరాలను పూర్తి చేయాలి. పాఠశాలలో మొత్తం 419 మంది విద్యార్థులుండగా, ఇంటర్నెట్ బాగుంటే ఒక్కో విద్యార్థి వివరాల నమోదుకు కనీసం ఒక నిమిషం సమయం పడుతుందని, లేదంటే కుస్తీ పడాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
సీన్ రివర్స్!
అయితే, పూతలపట్టు జెడ్పీ హైస్కూల్‌లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. తరగతి గదుల్లో పాఠాలు వినాల్సిన విద్యార్థినులను తీసుకువచ్చి ఈ డేటా ఎంట్రీ పనుల్లో కూర్చోబెట్టారు. అంతటితో ఆగకుండా, ఆ విద్యార్థినులు పని చేస్తున్న సమయంలో వారిని పర్యవేక్షించేందుకు కనీసం ఒక్క ఉపాధ్యాయుడు కూడా అక్కడ లేకపోవడం గమనార్హం.
చర్యలకు డిమాండ్
పిల్లలు చదువుకునేందుకు పాఠశాలకు పంపితే ఇ లాంటి ఆఫీసు పనులు చేయిస్తారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆనన్‌లైన్ నమోదులో ఏదైనా తప్పులు దొర్లి స్తే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు తమ విధులను పక్కనపెట్టేశారు. విద్యామిత్ర కిట్లవివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే బాధ్యతను విద్యార్థినుల భుజానికెత్తేశారు. చక్కగా చదువుకోవాల్సిన వారి చేతిలో సెల్‌ఫోన్ పెట్టి డేటా ఎంట్రీ చేయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది కొరతంటూ కుంటి సాకులు చెబుతున్నారు. టీచర్ల వ్యవహారశైలిపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పిస్తారని పంపిస్తే గుమస్తా పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వింత సమర్థన
దీనిపై పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులను వివరణ కోరగా వారు వింత సమాధానం ఇచ్చారు. పాఠశాలలో సిబ్బంది కొరత వేధిస్తోందని, అందుకే విద్యార్థుల సహాయంతో ఈ వివరాలను ఆన్‌్‌లైన్ చేస్తున్నామంటూ సమర్థించుకు నే ప్రయత్నం చేశారు. కానీ,పాఠశాల రికార్డుల ప్రకా రం ఇక్కడ ఏకంగా 18 మంది ఉపాధ్యాయులు విధు లు నిర్వర్తిస్తున్నారు. ఇంతమంది ఉండి కూడా, కేవ లం డేటాఎంట్రీ పనుల కోసం విద్యార్థుల చదువును పణంగా పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


