చిత్తూరు కలెక్టరేట్ : పేద బాలికల విద్యాభివృద్ధికి వసతిగృహం ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. శనివారం చిత్తూరులోని కణ్ణన్ కళాశాల ప్రాంగణంలో నిర్మించిన కణ్ణన్ బాలికల హాస్టల్‌ను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికలకు సురక్షితమైన వసతి కల్పిస్తే, వారి విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పారు. పూర్వ విద్యా ర్థుల సంఘం, ప్రజాప్రతినిధులు, దాతలు సమన్వయంతో వసతి గృహ నిర్మాణం విజయవంతంగా పూర్తయిందన్నారు. ప్రస్తుతం ఈ భవనంలో సుమా రు 120 మంది విద్యార్థినులకు వసతి కల్పించే అవకాశం ఏర్పడిందని తెలిపారు. అలాగే కణ్ణన్ పాఠశా ల, కళాశాలలో విద్యార్థినుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రెండేళ్ల పాటు పూర్వ విద్యార్థులు కణ్ణన్ సంస్థకు అండగా నిలవాలని కోరారు. పాఠశాల మైదానం అభి వృద్ధి, రన్నింగ్ ట్రాక్, లైటింగ్, క్రీడా వసతుల కల్పనకు రూ. 25 లక్షలతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశా మని వెల్లడించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ ఏళ్ల చరిత్ర కలిగిన కణ్ణన్ విద్యాసంస్థలో చదువుకునే పేద విద్యార్థినులకు హాస్టల్ నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. దా తల సహకారం, ట్రస్టుల నిధులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో సుమారు రూ.1.10 కోట్లు వెచ్చించి హాస్టల్ నిర్మించినట్లు వివరించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత, కణ్ణన్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సయ్యద్ మౌలా, హెచ్‌ఎం కోమల పాల్గొన్నారు.


