బట్టబయలు! | - | Sakshi
Sakshi News home page

బట్టబయలు!

Jul 19 2026 1:56 AM | Updated on Jul 19 2026 1:56 AM

నీవా నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు రాత్రికి రాత్రే తమిళనాడుకు తరలిస్తున్న టీడీపీ నేతలు అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి

ఇసుక దోపిడీ..

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నగర శివా రులోని పూనేపల్లెను అడ్డాగా చేసుకుని టీడీపీ నేతలు భారీగా ఇసుక దోపిడీకి తెరతీశారు. పూతలపట్టు వావిల్‌తోట, గారంపల్లె వద్ద నీవా నది పరివాహక ప్రాంతాల నుంచి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. పూనేపల్లెలో భారీ డంప్‌లు ఏర్పాటు చేశారు. పచ్చమూక రెండు గ్రూపులుగా విడిపోయి మరీ ఇసుక దోపిడీకి పాల్పడుతుండడం గమనార్హం. గారంపల్లెకి చెందిన నేతలు, మురకంబట్టు చెందిన నేతలు కలిసి..ఈ దోపిడీకి తెరలేపారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక్కడి నుంచి రాత్రి వేళల్లో జేసీబీలతో లోడింగ్‌ చేస్తూ 10 టైర్లు, 16 టైర్ల భారీ లారీల్లో నిత్యం 20 నుంచి 25 వాహనాల్లో ఇసుకను తమిళనాడు , బెంగళూరుకు తరలిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. సుమారు 50 టన్నుల నుంచి 70 టన్ను ల ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నా అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లారీలను సీజ్‌ చేయాల్సిందే..

అనంతరం విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రసాద్‌ చౌదరి అనే వ్యక్తి కనుసన్నల్లోనే ఇసుక దందా సాగుతోందని స్థానికులే చెబుతున్నారని వివరించారు. పెనుమూరు మాజీ ఎంపీపీ హరిబాబునాయుడు ఈ డంప్‌ కోసం స్థలం లీజుకిచ్చినట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. అలాగే విజయకుమార్‌, నరసింహులునాయుడు అనే వ్యక్తులు సైతం దందాలో ఉన్నారన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు సమీప బంధువే ఇసుక దందా ప్రధాన సూత్రధారిగా ఉన్నారని ఆరోపించారు. సిమెంట్‌ రవాణా కోసమంటూ నకిలీ బిల్లులు సృష్టించి, ఆ పేరుతో ఇసుక స్మగ్లింగ్‌ చేస్తున్నారని వెల్లడించారు. ఇసుక డంప్‌ వద్ద తమకు దొంగ బిల్లులు సైతం దొరికినట్లు తెలిపారు. ఎవరైనా ఇసుకను పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే, ఇకపై ఎక్కడ ఇసుక అక్రమ రవాణా జరిగినా నేరుగా వెళ్లి దాడి చేసి పట్టుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement