సాక్షి టాస్క్‌ఫోర్స్ : చిత్తూరు నగరంలో టీడీపీ, జనసేన పార్టీ నేతలపై ఆరోపణలు రచ్చకెక్కాయి. జనసేన మహిళా నేత తనను బెదిరిస్తున్నారని ఓ మహిళ ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ప్రోద్బలంతోనే ఆ మహిళ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ జనసేనమహిళా నేత మీడియా సమావేశంలో మండిపడ్డారు. తాజాగా చిత్తూరులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
మహిళ ఆరోపణలు ఇలా..
తమిళనాడుకు చెందిన ఫాతిమా అనే మహిళ తన కుమార్తె చదువుకోసం చిత్తూరు రామ్‌నగర్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ ఇంటిపై జనసేన నేత ఆరణి కవిత, చంద్రమౌళికి మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. లీజు సమయంలో తాను ఇచ్చిన నగదు తిరిగివ్వకుండా ఇల్లు ఖాళీ చేయాలని ఆరణి కవిత, ఆమె మేనల్లుడు ఆరణి జ్యోతీశ్వర్, వీరం వినోద్ అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నారని ఫాతిమా ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నాయుడు అనుచరులు తనకు ఫోన్‌చేసి తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కొన్ని ఆడియోలు సైతం తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ కోరారు.
కూటమి నేతలపై
ఆరోపణలు చేస్తున్న ఫాతిమా
చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న జనసేన నేత కవిత
అన్నీ అతడివల్లే..
అయితే ఫాతిమా చేసిన ఆరోపణలను జన సేన నేత ఆరణి కవిత తోసిపుచ్చారు. మంగళవారం ఆమె చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తన కు, తన మాజీ భర్తకు మధ్య గత ఎనిమిదేళ్లుగా సాగు తున్న వివాదానికి కుల పెద్దలు, టూటౌన్ పోలీసుల సమక్షంలో ఎప్పుడో ముగింపు పడిందన్నారు. భరణం కింద నా పేరు, చంద్రమౌళి పేరు మీద ఉన్న ఇంట్లో సగభాగా న్ని తనకు ఇచ్చారన్నారు. అయితే, ఆ ఇంట్లో లీజుకు ఉంటున్న ఫాతిమా అనే మహిళ ఇల్లు ఖాళీ చేయకుండా సాకులు వెతుకుతోందని మండిపడ్డారు. దీని వెనుక తన మాజీ భర్త చంద్రమౌళి ఉన్నారన్నారని ఆరోపించారు. తమ మధ్య గొడవలోకి టీడీపీ నేత కాజూరు బాలాజీ ఎంట్రీ ఇచ్చి, తన సమస్యను మరింత పెద్దది చేశారన్నారు. ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా సెటిల్‌మెంట్లకు కాడ కాజూరు బాలాజీ, ఆయన అనుచరులే ఉంటారని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తోంది వైఎస్సార్‌సీపీ నేతలు కాదని, జనసైనికులమని చెప్పుకు తిరుగుతున్న ఆ ఐదుగురేనన్నారు. ఈ కుట్రలపై ఇప్పటికే జనసే న పార్టీ కార్యాలయానికి ఫిర్యా దు చేశానని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వేధిస్తున్న వారిపై పోలీసులు సైతం తక్షణమే కఠిన చర్యలు తీసుకుని, తనకు రక్షణ కల్పించాలని ఆరణి కవిత డిమాండ్ చేశారు.


