ఏనుగుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఏనుగుల బీభత్సం

Jul 15 2026 12:35 AM | Updated on Jul 15 2026 12:35 AM

గుడిపాల: ఏనుగులు బీభత్సం కారణంగా మంగళవారం వెంగమనాయుడుకండ్రిగకు చెందిన చంద్రశేఖర్‌నాయుడు ఖర్జూరపు తోట ధ్వంసమైంది. ఏనుగులు గుంపు ఒక్కసారిగా తోటను నాశనం చేసేశారు. కోతకు వచ్చిన ఖర్జూరపు పండ్లను తినేశాయి. దీంతో బాధిత రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఐరాల: మండలంలోని అగరంపల్లె వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కాణిపాకం ఎస్‌ఐ నరసింహులు కథ నం మేరకు.. తవణంపల్లె మండలం కొత్తూరు వడ్డిపల్లెకు చెందిన జగదీష్‌(35) ద్విచక్రవాహనంపై కాణిపాకంలోని బంధువుల ఇంటికి బయలుదేరాడు. అగరంపల్లె వద్ద ఐరాల వైపు వెళుతు న్న ట్రాక్టర్‌ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొ న్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement