– చిత్తూరులో జర్నలిస్టు సంఘాల ఆందోళన
చిత్తూరు కలెక్టరేట్: తిరుపతిలో టీడీపీ నేతల విస్తృతస్థాయి సమావేశాన్ని కవర్ చేయడానిక వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆ పార్టీ నేతలు దాడి చేయడం దారుణమని, ఇలాంటి దుర్మార్గాలను సహించమని జర్నలిస్ట్‌లు మండిపడ్డారు. మంగళవారం చిత్తూరులో పాత్రికేయులు ఆందోళనకు దిగారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్, ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ర్యాలీగా చేపట్టారు. ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథన్ మాట్లాడుతూ మంత్రుల సమక్షంలో పాత్రికేయులపై టీడీపీ నేత లు భౌతిక దాడులుచేసి, రక్తగాయాలు వచ్చేట్లు కొట్టడం హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటి వరకు కేసు నమోదు కాకపోవడం అన్యాయమన్నా రు. ఈ ఘటనపై కనీసం మంత్రులు క్షమాపణలు కూడా చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలని, నిందితులను టీడీపీ నుంచి సస్పెండ్‌చేసి.. క్రిమినల్ కేసులు పెట్టాల ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే పాత్రికేయుల పరిరక్షణ కమిటీను ఏర్పా టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంత రం ఆర్‌డీఓకు వినపతిపత్రం అందజేశా రు. చిత్తూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, కాళేశ్వరరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ పాల్గొన్నా రు. అలాగే ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు సైతం ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. పాత్రికేయులపై దాడు లకు పాల్పడ్డవాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నేతలు ప్రకాష్, కేశవులు పాల్గొన్నారు.


