
విద్యుత్ షాక్‌తో వివాహిత..
కార్వేటినగరం: విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని ఆర్కేవీబీ పేటలో శనివారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ కథనం మేరకు.. ఇందిరా కాలనీకి చెందిన నాగూరయ్య కుమార్తె సుమతి(39)ని ఆర్కేవీబీ పేట గ్రామానికి చెందిన నాగయ్యకు ఇచ్చి 20 ఏళ్ల కిందట వివాహం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం ఉదయం ఇంట్లోని లైట్ స్విచ్ ఆన్ చేసింది. అయితే లైట్ వెలగక పోవడంతో వైర్‌ను కదిలించే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటినా కార్వేటినగరం సీహెచ్‌సీకి తరలించారు. వైద్య సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం సుమతి భర్త నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.