
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు..
తవణంపల్లె: ద్విచక్ర వాహనాంలో ప్రయాణిస్తున్న వృద్ధురాలిని ఆర్టీని బస్సు వెనుక వైపు నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం తవణంపల్లెలో జరిగింది. తవణంపల్లె ఎస్‌ఐ చిరంజీవి కథనం మేరకు.. గంగవరం మండలం కీలపట్ల హరిజనవాడకు చెందిన టి. నారాయణమ్మ(74), తన మనవడు టి.మునీంద్రతో కలసి మోటార్ సైకిల్‌లో కాణిపాకం గుడికి వెళుతుండగా చిత్తూరు– అరగొండ ప్రధాన రహదారిలోని తవణంపల్లెలో ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి, వెనుక వైపు ఢీకొంది. దీంతో వృద్ధురాలు కిందపడడంతో బస్సు వెనుక టైరు తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందినది. మృతురాలు మనవడు మునీంద్రకు స్వల్ప గాయాలు తగిలి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. మునీంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.