
రుయాలో జీడీ నెల్లూరు వాసి మృతి
గంగాధరనెల్లూరు: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఓ వ్యక్తి మృతి చెందాడని, ఆస్పత్రిలో నమోదైన వివరాల మేరకు అతడు జీడీ నెల్లూరు వాసిగా గుర్తించారని, ఎవరైనా మృతుడిని గుర్తిస్తే వివరాలు తెలపాలని స్థానిక పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఓ వ్యక్తి మృతి చెందాడని, అతడి ఓపి రిజిస్ట్రేషన్ ను పరిశీలించగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వేల్కూరు గ్రామానికి చెందిన ఉమామహేష్ (36)గా ఓపీ చీటీలో నమోదు చేసినట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆస్పత్రిలో చేర్పించినట్టు సమాచారం. పోలీసుల విచారణలో తప్పుడు చిరునామాగా అనుమానిస్తూ, మృతుడిని ఎవరైనా గుర్తిస్తే తిరుపతి వెస్ట్ పోలీసులను సంప్రదించాలని కోరారు.