
వీడ్కోలు
‘గణ’
జిల్లాలో అయిదు రోజులుగా పూజలందుకున్న గణనాథుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, పూతలపట్టు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో రాత్రి పొద్దుపొయే వరకూ శోభాయమానంగా సాగిన ఊరేగింపు అనంతరం స్థానిక చెరువులో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు. నృత్యాలు చేస్తూ గణనాథుడిని ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేశారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం గణనాథుడి నిమజ్జన వేడుకలు అట్టహాసంగా సాగాయి. చవితిని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో వినాయకుడిని కొలువుదీర్చారు. అయిదు రోజుల పాటు భక్తుల చేత విశేష పూజలు అందుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అన్ని ప్రాంతాల్లో జలాధి పూజలు అంబరాన్నంటాయి. ఇంటింటా పూజలు అందుకున్నారు. ఊరేగింపుగా వస్తున్న స్వామి వారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు, పసుపు పళ్లెం పట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
కట్ట మంచి చెరువులో నిమజ్జన కోలాహలం
కట్టమంచి చెరువు వద్ద నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందకు క్రేన్‌లను అందుబాటులో ఉంచారు. నిమజ్జనం చేసేందుకు వచ్చిన భక్తులు చివరి పూజలు చేసి బై..బై గణేశా అంటూ స్వామి వారిని నిమజ్జనం చేశారు. రద్దీని కట్టడి చేసేందుకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేలా చూశారు.
కట్ట మంచి చెరువు వద్ద వినాయకుడి నిమజ్జనం చేసేందుకు
వచ్చిన అపోలో కళాశాల విద్యార్థులు
చిత్తూరు : గిరింపేటలో ఊరేగుతున్న భారీ వినాయకుడు, మిట్టూరులో ఊరేగింపు, చెరువులో నిమజ్జనం చేస్తున్న యువకులు, పుంగనూరు : నానబాలమునెమ్మ వీధిలో గుజరాతీలు వినాయకుడి ఊరేగింపు..పాలసముద్రం : నిమజ్జన ఊరేగింపు

వీడ్కోలు

వీడ్కోలు

వీడ్కోలు

వీడ్కోలు

వీడ్కోలు