
గంగమ్మా..దీవించమ్మా
– కిక్కిరిసిన బోయకొండ
చౌడేపల్లె : పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. కోరిన కోర్కెలు తీర్చే గంగమ్మా.. కోర్కెలు తీర్చి మమ్మల్ని ఆశీర్వదించమ్మా అంటూ భక్తులు పూజలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలి వచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో ఆలయం వద్దకు చేరుకొని గంగమ్మకు పూజలు చేశారు. అధిక సంఖ్యలో దర్శన కోసం భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి, నూనెదీపాలు, దీవెలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు.