యాదమరి : ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించుకోమని చెబుతూనే వివిధ రకాల బాధ్యతలను అప్పగిస్తూ క్షోభకు గురిచేస్తోందని యూటీఎఫ్ జిల్లా నాయకులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మండల పరిధిలోని ఓ కళ్యాణ మండపంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ , ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లిస్తామని చెప్పారు. కాని ఇంత వరకు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారంలోకి రాగానే పీఆర్సీ అమలు చేస్తామని ప్రగల్భాలు పలికి పట్టించుకోకపోవడం దారుమణన్నారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చాలని జిల్లా అధ్యక్షుడు సోమశేఖర నాయుడు కోరారు. ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా యూటీఎఫ్ నాయకులు, వక్తలు పాల్గొన్నారు.