
ప్రయివేటు లే అవుట్‌కు గ్రావెల్
విజయపురం : మండలంలోని మహారాజపురం తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ఓ ప్రయివేటు లేఅవుట్‌కు కూటమి నాయకులు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. సుమారు 20 ఎకరాలు కలిగిన ఈ లేఅవుట్‌కు మట్టి తరలింపు కోసం కూటమి నాయకులు రూ.2 కోట్ల మేర ఒప్పదం కుదుర్చుకున్నట్టు సమాచారం. మంగళవారం మహారాజపురం గుట్ట నుంచి టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా గ్రావెల్ తరలించారు. ఒక టిప్పర్ గ్రావెల్ రూ.10 వేల చొప్పున 2000 ట్రిప్పుల గ్రావెల్ తరలించేందుకు డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. స్థానికులు సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలియజేసినా వారు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

ప్రయివేటు లే అవుట్‌కు గ్రావెల్