
నిఘా కట్టుదిట్టం
కాణిపాకం: బ్రహోత్సవ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అక్కడక్కడ సీసీ కెమెరాలు బిగించారు. ఆలయం చుట్టూ మూడో కన్ను తెరిచారు. దీనికితోడు ఈసారి డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టనున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడడానికి వివిధ శాఖల అధికారులకు అక్కడ విధులు నిర్వహించేలా కలెక్టర్, ఎస్పీ చర్యలు చేపట్టారు. ఆలయ అధికారులు సైతం ఉత్సవ నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తున్నారు. కాగా ఈ ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, ఈవో పెంచలకిషోర్ పరిశీలించారు.
భక్తిశ్రద్ధలతో పూజిద్దాం
పుంగనూరు: వినాయక చవితిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆది దేవుడిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించి కష్టాలు తొలగిపోయేలా ప్రార్థించాలని సూచించారు.

నిఘా కట్టుదిట్టం