
వడమాలపేటలో నెమళ్లు ప్రత్యక్షం
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట సద్గురు సన్నిధి వద్ద మంగళవారం రెండు నెమళ్లు ప్రత్యక్షమయ్యాయి. విషయం తెలుసుకున్న పాదిరేడు గొల్లపల్లి బీట్ ఆఫీసర్ మునినాయక్ సద్గురు సన్నిధి వద్దకు చేరుకుని పరిశీలించారు. అవి పగటి పూట ఇక్కడకు వచ్చినా రాత్రి వేళకు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతాయని సద్గురు సన్నిధి నిర్వాహకులు తెలిపారు.
ఎరువుల దుకాణం తనిఖీ
నగరి : నగరి మున్సిపల్ పరిధిలో ఉన్న ఎరువుల దుకాణాన్ని మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారి నిరంజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎరువులు అధిక ధరకు విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట వ్యవసాయాధికారి రామాంజనేయులు, ఏడీఏ కవిత, నగరి ఏవో రాఘవేంద్ర యాదవ్ ఉన్నారు

వడమాలపేటలో నెమళ్లు ప్రత్యక్షం