
పకడ్బందీగా స్వామిత్వ కుటుంబ సర్వే
ఐరాల: స్వామిత్వ కుటంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, డీపీఓ సుధాకర్‌నాయుడు ఆదేశించారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శలతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ఆయా గ్రామాల పరిధిలోని ప్రతి ఇంటినీ సర్వే చేయాలని సూచించారు. సర్వే పూర్తి చేసిన తర్వాత ప్రతి కుటుంబానికీ స్వామిత్వ కార్డును అందజేయాలని ఆదేశించారు. డీపీఓ మాట్లాడుతూ ఐవీఆర్‌ఎస్ సర్వే, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఎంపీడీఓ ధనలక్ష్మి, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.