
దోపిడీ దొంగ అరెస్టు
చిత్తూరు కార్పొరేషన్: రైల్లో దోపిడీ చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న దొంగను సోమవారం రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.5.76 లక్షల విలువ చేసే 64 గ్రాముల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు రైల్వేస్టేషన్‌లో రైల్వే రేణిగుంట సీఐ యతీంద్ర వివరాలను తెలియజేశారు. ఈనెల 6న తిరుపతి–మదనపల్లికి వెళ్తున్న వేసవి ప్రత్యేక రైలులో తిరుపతికి చెందిన కవిత ప్రయాణిస్తోందని తెలిపారు. పాకాల సమీపంలో వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని దొంగులు ఆమైపె కత్తితో దాడి చేసి మెడలోని బంగారు మంగళ సూత్రం, గొలుసు, ఇతర ఆభరణాలను దోచుకెళ్లారన్నారు. దర్యాప్తులో దొంగను గుర్తించి ఆరెస్టు చేసినట్టు వెల్లడించారు.