
జనసేన మండల అధ్యక్షుడిపై కేసు నమోదు
గుడిపాల: ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఘటనకు సంబంధించి జనసేన గుడిపాల మండలం అధ్యక్షుడు రూప్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. చిత్తూరు రూరల్ మండలం ఎన్‌ఆర్‌పేట ఇసుక రీచ్ నుంచి తమిళనాడుకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు శనివారం తెల్లవారుజామున 2 గంటలకు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీనిపై స్పందించిన ఎస్‌ఐ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ టీఎన్05 ఆర్0839 నంబర్ టిప్పర్ తమిళనాడులోని పొన్నై వైపు వెళుతుండగా పట్టుకున్నారు. టిప్పర్ డ్రైవర్ శరవణని అరెస్టు చేశామని ఎస్‌ఐ చెప్పారు. డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం టిప్పర్ యజమాని శేఖర్‌తోపాటు ఇసుకను డంప్ చేసి అక్రమంగా టిప్పర్ ద్వారా తమిళనాడుకు ఇసుకను పంపిస్తున్న జనసేన గుడిపాల మండల పార్టీ అధ్యక్షుడు రూప్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.