
యువకుడి మృతిపై లేబర్ అధికారుల విచారణ
బంగారుపాళెం: మండలంలోని జయంతి గ్రామం వద్ద ఎక్స్‌ప్రెస్ హైవే పనులు చేస్తూ మరణించిన మైనర్ యువకుడి మృతిపై శనివారం చిత్తూరు లేబర్ అధికారులు విచారణ చేపట్టారు. ఈనెల 21వ తేదీ బిహార్ రాష్ట్రం చంబా జిల్లా జహీరా గ్రామానికి చెందిన సురేంద్రరాయ్ కుమారుడు బబ్లుకుమార్(19) ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా వెల్డింగ్ చేసేందుకు ఐరన్ రాడ్ పైకి తీసే క్రమంలో ప్రమాదవశాత్తు సమీపంలోని విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై బ్రిడ్జిపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు అసిస్టెంట్ లేబర్ అధికారి ఆనంద్‌బాబు, సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ ప్రసాద్‌తో కలసి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. లేబర్ యాక్టు నిబంధనల ప్రకారం మైనర్ బాలుడిని పనుల్లో పెట్టుకున్న సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.