కాలేయ మార్పిడికి రూ.10 లక్షలు | - | Sakshi
Sakshi News home page

కాలేయ మార్పిడికి రూ.10 లక్షలు

Sep 5 2023 1:42 AM | Updated on Sep 5 2023 2:05 PM

హనీఫా కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ అందిస్తున్న మంత్రి ఆర్కేరోజా   - Sakshi

హనీఫా కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ అందిస్తున్న మంత్రి ఆర్కేరోజా

నగరి : మున్సిపల్‌ పరిధి 5వ వార్డుకు చెందిన అబ్దుల్‌ బాషా కుమారుడు హనీఫా (45)కు కాలేయ మార్పిడికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.10 లక్షల ఎల్‌ఓసీని రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సోమవారం అందజేశారు. 5వ వార్డుకు చెందిన హనీఫాకు ఇటీవల కాలేయ సంబంధిత వ్యాధి సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తన కుమారుని పరిస్థితిని అబ్దుల్‌ భాషా మంత్రి ఆర్కేరోజాకు విన్నవించుకొని ఆర్థిక సాయం అందించాలని కోరాడు.

వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కాలేయ మార్పిడి చికిత్స కోసం రూ.10 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. తన నివాస కార్యాలయంలో సోమవారం బాధిత కుటుంబానికి అందజేశారు. వార్డు కౌన్సిలర్‌ దయానిధి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement