‘యో’ అంటారేంది గణేశా? | - | Sakshi
Sakshi News home page

‘యో’ అంటారేంది గణేశా?

Jul 13 2026 12:04 AM | Updated on Jul 13 2026 12:04 AM

భక్తులను కసురుకుంటున్న సిబ్బంది

కాణిపాకం క్షేత్రంలో నిత్యం ఇదే పరిస్థితి

పట్టించుకోని యాజమాన్యం

కాణిపాకం: సకల విఘ్నాలను తొలగించే వరసిద్ధి వినాయకుడిని దర్శించుకోవడానికి భక్తులు భక్తిపారవశ్యంతో వస్తుంటారు. కానీ, ఆ స్వామి సన్నిధిలోనే పనిచేస్తున్న కొందరు సిబ్బంది తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, ప్రశ్నిస్తే కసురుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది.

గణేశా అని పిలవమంటే.. యో అంటే!

తిరుమలలో భక్తులను గోవింద అని పిలుస్తూ.. వారిలో ఆధ్యాత్మిక భావనను నింపుతుంటారు. అదే తరహాలో కాణిపాకంలో కూడా భక్తులను గణేశా..! అని సంబోధించాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కానీ, క్షేత్ర స్థాయిలో సిబ్బందికి మాత్రం ఇవేమీ పట్టడం లేదు. ఆలయ పవిత్రతను విస్మరిస్తూ, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను గౌరవప్రదంగా పలకరించడానికి బదులు.. నిర్లక్ష్యంగా యో అంటూ సంబోధిస్తూ అవమానిస్తున్నారు. ఈ తీరుపై భక్తులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు.

పాలకమండలిపైనే విసుర్లు

సిబ్బంది దురుసుతనం ఎంతలా పెరిగిపోయిందంటే.. సాక్షాత్తు పాలకమండలి సభ్యులపైనే కసురుకునే స్థాయికి చేరింది. ఉన్నతాధికారులు ఎన్నిసార్లు మందలించినా, సస్పెన్షన్‌ వేటు వేసినా వీరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. కొందరు సిబ్బంది అహంకారపూరిత ప్రవర్తన వల్ల క్షేత్ర ప్రతిష్ట మసకబారుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. పాలక మండలిపైనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటే.. సామా న్య భక్తులకు పరిస్థితి ఎలా ఉంటుందో దీని బట్టి అర్థఽం చేసుకోవచ్చు. ఒకే స్థానంలో వీళ్లు పాతుకుపోవడంతో కూడా...ఇలా భక్తులంటే కనీస మర్యాదలు ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బాధ్యతారాహిత్యం

స్వామి దర్శనం కోసం ఎంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ సిబ్బంది ప్రవర్తన చూ స్తుంటే బాధగా ఉంది. కనీస మర్యాద లేకుండా కసురుకుంటున్నారని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఆలయ అధికారులు స్పందించి.. క్షేత్ర సిబ్బందికి కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

కసురుకోవడంతోనే.. విఘ్నేష్‌ సస్పెన్షన్‌

కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఆదివారం పీఆర్‌ఓ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది విఘ్నేష్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు. ఆలయ బోర్డు సభ్యులు స్వామి వారి దర్శనార్థం వచ్చారు. ఆశీర్వచ నం అందజేసే క్రమంలో విఘ్నేష్‌ అమర్యాదరగా ప్రవర్తించి కసురుకున్నాడు. దీంతో మనస్తాపానికిగురైన అనసూయ ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారించిన అధికారులు అత న్ని సస్పెండ్‌ చేశారు. భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈవో హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement