– 8లో
జిల్లాలో ర్యాంప్‌లకు వచ్చిన తోతాపురి మామిడిని అక్కడి వ్యాపారులు నేరుగా తమిళనాడుకు తరలిస్తున్నారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల దరఖాస్తుకు గడువు పొడిగించినట్లు ఇన్‌చార్జ్ డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే జారీ చేసిన షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ, ఆనన్‌లైన్ దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. ఫైనల్ సబ్ మిషన్‌కు ఈ నెల 20వ తేదీ వరకు సమయం ఉందన్నారు. జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఎంఈవోలు, హెచ్‌ఎంలు ప్రోత్సహించాలన్నారు. ప్రతి మండలం నుంచి కనీసం ఒక్కరైనా ఉపాధ్యాయులు నేషనల్ టీచర్ అవార్డ్స్‌కు దరఖాస్తు చేసేలా ఎంఈవోలు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
ముక్కంటి సేవకు
పోటెత్తిన భక్తులు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్త జనసంద్రంగా మారింది. వరుస సెలవులు రావడంతో సుమారు 36 వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 754, రూ.200 శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా 2,892 మంది, రూ.50ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా 2,686మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టికెట్ల ద్వారా 4117 మంది, రూ.750 టికెట్ల ద్వారా 1,405, రూ.1,500 టికెట్ల ద్వారా 454మంది, రూ.2,500 టికెట్ల ద్వారా 356 మంది, రూ.5 వేల టికెట్ల ద్వారా 153 మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. 17,593 ప్రసాదాలు అమ్ముడైనట్లు ఆలయ అధికారులు వివరించారు.


