నేడు పోలీసు గ్రీవెన్స్‌డే | - | Sakshi
Sakshi News home page

నేడు పోలీసు గ్రీవెన్స్‌డే

Jul 13 2026 12:04 AM | Updated on Jul 13 2026 12:04 AM

చిత్తూరు అర్బన్‌: చిత్తూరులోని వన్‌టౌన్‌ పక్కన్న ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమ వారం ప్రజాఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఎస్పీ తుషార్‌డూడి తెలిపారు. ఉద యం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమ వుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరు గా కలిసి మాట్లాడొచ్చన్నారు.

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయ ల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉదయం 8.30 ... 9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌

చిత్తూరు కలెక్టరేట్‌: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారనిన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పోలీసులకు చిక్కిన

గంజాయి స్మగ్లర్‌

చిత్తూరు అర్బన్‌: నగరంలో రెండు నెలల క్రితం పోలీస్‌ స్టేషన్‌ నుంచి పారిపోయిన గంజాయి స్మగ్లర్‌ జఫ్రీన్‌ను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక–మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దులో ఉన్న భద్రావతి ప్రాంతానికి చెందిన ఇతడ్ని రెండు నెలల క్రితం వన్‌టౌన్‌ పోలీసులు పట్టుకున్నా రు. ఆపై స్టేషన్‌లో కూర్చబెట్టగా.. పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. పలు ప్రాంతాల్లో జఫ్రీన్‌ ఆచూకీ కోసం నిఘా ఉంచిన పోలీసులు, ఎట్టకేలకు అతడ్ని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.

కాణిపాకం కిటకిట

కాణిపాకం: వరుస సెలవుల నేపథ్యంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో క్యూలైన్లు, మాడ వీధులు నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, క్యూల్లో వేచి ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. దర్శన సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

రక్షణ గోడను ఢీకొన్న ఐచర్‌

– తప్పిన ప్రాణాపాయం

బంగారుపాళెం: మండలంలోని కొత్తపల్లె వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై ఆదివారం సాయంత్రం ఐచర్‌ వాహనం అదుపుతప్పి రక్షణగోడను ఢీకొంది. ఈ ఘటనతో తృటి లో ప్రాణాపాయం తప్పింది. బెంగళూరు నుంచి చైన్నెకి పూల బస్తాలను తరలిస్తున్న ఐచర్‌ వాహ నం కొత్తపల్లె ఫ్లైఓవర్‌పై గల రహదారిపైకి రాగా నే టైరు పగిలిపోయింది. అదుపుతప్పిన వాహ నం ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన సేఫ్టీవాల్‌ (రక్షణగోడ)ను ఢీకొని వాలిపోయింది. ఐచర్‌ వాహనంలోని డ్రైవర్‌, క్లీనర్‌ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఫ్లైఓవర్‌పై నుంచి ఐచర్‌ వాహ నం సర్వేసు రోడ్డుపై పడి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని వాహనదారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement