
న్యూఢిల్లీ: జొమాటో, హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ మధ్య భాగస్వా మ్యం కుదిరింది. జొమాటో డెలివరీ భాగస్వాములకు ‘ఎన్‌పీఎస్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్‌మోడల్’ను హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ ఆఫర్ చేయనుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రారంభించారు.
‘‘ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన 72 గంటల్లోనే 30,000 మందికి పైగా డెలివరీ భాగస్వాములు శాశ్వత రిటైర్మెంట్ ఖాతా నంబర్లను (ప్రాన్) తీసుకున్నారు. లక్ష మందికి పైగా డెలివరీ భాగస్వాములకు ఎన్‌పీఎస్ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని జొమాటో ప్రకటించింది.