
ప్రారంభించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నాలుగో విడత వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెపె్టంబర్ 25న (రేపు) ప్రారంభించనున్నారు. దేశీయంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో రష్యన్ ఫెడరేషన్ ఉప ప్రధాని దిమిత్రీ ప్యాట్రిòÙవ్‌తో పాటు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గోనున్నారు.
న్యూజిలాండ్, సౌదీ అరేబియా భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 21 దేశాలు పాల్గొంటున్నాయి. 2023లో నిర్వహించిన ఈవెంట్‌లో రూ. 33,000 కోట్ల విలువ చేసే అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరాయి. 2024లో ప్రధానంగా టెక్నాలజీ బదలాయింపు ఒప్పందాలపై దృష్టి పెట్టారు. గత ఎడిషన్ల దన్నుతో ఈసారి మరింత భారీగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు పాశ్వాన్ తెలిపారు. ప్రాసెస్డ్ ఆహారం వల్ల స్థూలకాయం, ఇతరత్రా అనారోగ్యాలు వస్తాయనే అపోహలను పారద్రోలేందుకు ఉద్దేశించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు.