9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా.. | What Is 9K Gold? Check The Price, Quality, Difference: All You Need To Know | Sakshi
Sakshi News home page

9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా..

Aug 22 2025 2:53 PM | Updated on Aug 22 2025 5:37 PM

What Is 9K Gold? Check The Price, Quality, Difference: All You Need To Know

బంగారం అంటేనే అందరికీ 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ లేదా 18 క్యారెట్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ 9K లేదా 9 క్యారెట్ గోల్డ్ ఒకటి ఉందని, దీని ధర చాలా తక్కువ ఉంటుందని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో 9 క్యారెట్స్ గోల్డ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

బంగారం పట్ల భారతీయులకు మక్కువ ఎక్కువ, అయితే 24 క్యారెట్స్ లేదా 22 క్యారెట్స్ గోల్డ్ కొనాలంటే చాలా డబ్బు వెచ్చించాలి. కానీ 9 క్యారెట్స్ గోల్డ్ కొనాలంటే మాత్రం అంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా ఈ 9 క్యారెట్స్ బంగారానికి కూడా హాల్‌మార్కింగ్ ఉండాలని.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) స్పష్టం చేసింది.

2025 ఆగస్టు నాటికి హాల్‌మార్క్ ప్యూరిటీల జాబితాలో 14 క్యారెట్స్, 18 క్యారెట్స్, 20 క్యారెట్స్, 22 క్యారెట్స్, 23 క్యారెట్స్, 24 క్యారెట్స్ మాత్రమే ఉండేవి. ఇటీవల 9 క్యారెట్స్ గోల్డ్ కూడా జాబితాలో చేరింది.

24 క్యారెట్స్.. 9 క్యారెట్స్ బంగారం మధ్య వ్యత్యాసం
24 క్యారెట్స్ బంగారం అనేది.. 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం అన్నమాట. అంటే ఇందులో దాదాపుగా ఇతర లోహాలు ఉండవు. అయితే 9 క్యారెట్స్ బంగారంలో 37.5 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన 62.5 శాతం.. రాగి, వెండి లేదా జింక్ వంటి మిశ్రమ లోహాలతో కూడి ఉంటుంది.

9 క్యారెట్స్ బంగారం ఎందుకు?
అధిక క్యారెట్ల బంగారం ధర చాలా ఎక్కువ. కాబట్టి ఎక్కువ మంది వినియోగదారులు.. ముఖ్యంగా యువకులు లేదా గ్రామీణ ప్రజలు దీనికోసం అంత డబ్బు కేటాయించలేరు. అలాంటి వారు ఈ 9 క్యారెట్స్ గోల్డ్ కొనడానికి ఇష్టపడతారు. దీనికి హాల్‌మార్క్ కూడా ఉండటం వల్ల ఎలాంటి మోసాలకు గురికాకుండా ఉంటారు.

ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్‌కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?

9 క్యారెట్స్ vs 24 క్యారెట్స్ గోల్డ్ ధరలు
ఒక గ్రామ్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 10,000 కంటే ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే.. 10 గ్రాముల కోసం రూ. లక్ష కంటే ఎక్కువ కేటాయించాలి. అయితే ఒక గ్రామ్ 9 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 3,700 ఉంటుంది. ఈ బంగారాన్ని 10 గ్రాములు కొనాలంటే రూ. 37,000 పెట్టుబడి సరిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement