పేటీఎమ్‌ నుంచి బెర్క్‌షైర్‌ ఔట్‌ | Sakshi
Sakshi News home page

పేటీఎమ్‌ నుంచి బెర్క్‌షైర్‌ ఔట్‌

Published Sat, Nov 25 2023 5:10 AM

Warren Buffett Berkshire Hathaway exits Paytm - Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌లోగల మొత్తం 2.46 శాతం వాటాను ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ కంపెనీ బెర్క్‌షైర్‌ హాథవే తాజాగా విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా పేటీఎమ్‌ మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌లోగల 1.56 కోట్లకుపైగా షేర్లను ఆఫ్‌లోడ్‌ చేసింది.

షేరుకి రూ. 877.29 సగటు ధరలో విక్రయించిన వీటి విలువ దాదాపు రూ. 1,371 కోట్లు. అనుబంధ సంస్థ బీహెచ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ ద్వారా మొత్తం వాటాను విక్రయించింది. కాగా.. దీనిలో 1.19 శాతం వాటాకు సమానమైన 75,75,529 షేర్లను కాప్తాల్‌ మారిషస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కొనుగోలు చేయగా.. 42.75 లక్షల షేర్ల(0.67 శాతం వాటా)ను ఘిసల్లో మాస్టర్‌ ఫండ్‌ ఎల్‌పీ సొంతం చేసుకుంది. ఇందుకు షేరుకి రూ. 877.2 సగటు ధరలో దాదాపు రూ. 1,040 కోట్లు వెచ్చించాయి.

ఈ నేపథ్యంలో పేటీఎమ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతంపైగా క్షీణించి రూ. 895 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement