అమెరికా డాలర్ కుప్పకూలుతుందా?: పీటర్ షిఫ్ హెచ్చరిక! | Is the US Dollar Heading for a Crash Peter Schiff Issues Warning | Sakshi
Sakshi News home page

అమెరికా డాలర్ కుప్పకూలుతుందా?: పీటర్ షిఫ్ హెచ్చరిక!

Jul 3 2026 7:32 PM | Updated on Jul 3 2026 8:21 PM

Is the US Dollar Heading for a Crash Peter Schiff Issues Warning

అమెరికన్ ఆర్థికవేత్త పీటర్ షిఫ్ (Peter Schiff) అమెరికా డాలర్ భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పీటర్ షిఫ్ అభిప్రాయం ప్రకారం, అమెరికా డాలర్ విలువ భవిష్యత్తులో భారీగా పడిపోవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద స్థాయి సంక్షోభం రావచ్చని తెలుస్తోంది.

2008లో జరిగిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనా వేసిన కొద్దిమంది విశ్లేషకులలో పీటర్ షిఫ్ కూడా ఒకరని చాలామంది చెబుతారు. ఆ సమయంలో అమెరికా హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడం, బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్యలు రావడం వంటి అంశాలను ఆయన ముందే హెచ్చరించారని అంటారు. అందుకే ఆయన వ్యాఖ్యలకు కొంతమంది ఆర్థిక వర్గాల్లో ప్రాధాన్యం ఇస్తారు.

ఇప్పుడు ఆయన డాలర్ గురించి చేస్తున్న వ్యాఖ్యల వెనుక ప్రధాన కారణం ఏమిటంటే.. అమెరికా ప్రభుత్వ అప్పులు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం ఒత్తిడి కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు డాలర్‌పై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా దీర్ఘకాలంలో డాలర్ బలహీనపడే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆయన ''ఆర్థిక సంక్షోభానికి సిద్ధంగా ఉండాలి'' అనే హెచ్చరికలు ఇస్తున్నారు.

నిజానికి ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొందరు ఆయన హెచ్చరికలను తీవ్రమైన ప్రమాద సంకేతంగా చూస్తే, మరికొందరు వాటిని అతిశయోక్తిగా భావిస్తారు. డాలర్ ప్రపంచంలో ఇంకా అత్యంత బలమైన కరెన్సీగానే కొనసాగుతోంది, ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిమాణం, ట్రేడ్, గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ స్థానం చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి డాలర్ విలువ తగ్గుతుందా? లేదా?, రానున్న రోజుల్లో ఆర్ధిక సంక్షోభం వస్తుందా? లేదా? అనే విషయాలను ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు.

ఇదీ చదవండి: బంగారం ఉన్నవారికి శుభవార్త.. ఈ స్కీమ్‌తో భారీ లాభం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement