breaking news
predicted
-
ఏఐతో భారీ సంక్షోభం: జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్ భవిష్యవాణి!
లండన్: కోవిడ్-19 మహమ్మారి, 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనా వేసి, హెచ్చరించిన ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వల్ల మానవాళికి పెను ముప్పు పొంచి ఉందంటూ మరో హెచ్చరిక చేశారు. గతంలో ఆయన చేసిన హెచ్చరికలను కొందరు ‘భయపెట్టే ధోరణి’గా కొట్టిపారేసినప్పటికీ, అవి నిజమయ్యాయి. అయితే ఇప్పుడు రాబర్ట్ పెస్టన్ చెప్పిన ఏఐ ముప్పుపై ప్రపంచమంతా ఆలోచిస్తోంది.పెస్టన్ తన కొత్త పుస్తకం ‘ది కిల్ స్విచ్’లో ఏఐ వల్ల భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఒకటి రెండు సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని, ఏఐ కోసం డేటా సెంటర్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల కోసం అపారమైన పెట్టుబడులు తరలివెళ్తుండటమే దీనికి కారణమని ఆయన విశ్లేషించారు. ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి లేకుండా పోతే, ప్రభుత్వాలు ఆదాయపు పన్ను లేకుండానే ప్రజా సేవలను నిర్వహించే మార్గాలపై ఆలోచించాలని ఆయన సూచించారు.గతంలో బ్యాంకింగ్ రంగం తీరు వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని 2007లోనే హెచ్చరించినప్పుడు తనపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారని ఆయన గుర్తుచేశారు. అలాగే, 2009-2010 సమయంలో చైనాలో పర్యటించిన అనుభవంతో, 2019 చివరిలో ఊహించని కొత్త వైరస్ (కోవిడ్-19) వెలుగుచూసినప్పుడు ప్రభుత్వ వర్గాలను అప్రమత్తం చేశానని ఆయన తెలిపారు.ఇది కూడా చదవండి: నటుడు ప్రకాష్ రాజ్‌కు భూ ఆక్రమణల నోటీసు -
అమెరికా డాలర్ కుప్పకూలుతుందా?: పీటర్ షిఫ్ హెచ్చరిక!
అమెరికన్ ఆర్థికవేత్త పీటర్ షిఫ్ (Peter Schiff) అమెరికా డాలర్ భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పీటర్ షిఫ్ అభిప్రాయం ప్రకారం, అమెరికా డాలర్ విలువ భవిష్యత్తులో భారీగా పడిపోవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద స్థాయి సంక్షోభం రావచ్చని తెలుస్తోంది.2008లో జరిగిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనా వేసిన కొద్దిమంది విశ్లేషకులలో పీటర్ షిఫ్ కూడా ఒకరని చాలామంది చెబుతారు. ఆ సమయంలో అమెరికా హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడం, బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్యలు రావడం వంటి అంశాలను ఆయన ముందే హెచ్చరించారని అంటారు. అందుకే ఆయన వ్యాఖ్యలకు కొంతమంది ఆర్థిక వర్గాల్లో ప్రాధాన్యం ఇస్తారు.ఇప్పుడు ఆయన డాలర్ గురించి చేస్తున్న వ్యాఖ్యల వెనుక ప్రధాన కారణం ఏమిటంటే.. అమెరికా ప్రభుత్వ అప్పులు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం ఒత్తిడి కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు డాలర్‌పై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా దీర్ఘకాలంలో డాలర్ బలహీనపడే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆయన ''ఆర్థిక సంక్షోభానికి సిద్ధంగా ఉండాలి'' అనే హెచ్చరికలు ఇస్తున్నారు.🚨 BREAKING:THE MAN WHO PREDICTED THE 2008 CRASH, PETER SCHIFF, JUST SAID:"US DOLLAR WILL CRASH. PREPARE FOR A HISTORIC ECONOMIC COLLAPSE."HE PREDICTED THE 2008 CRASH AND CONTROLS OVER $2.18 BILLION NOWHE KNOWS SOMETHING BAD IS COMING... pic.twitter.com/d97gKHXJp4— ᴛʀᴀᴄᴇʀ (@DeFiTracer) July 2, 2026నిజానికి ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొందరు ఆయన హెచ్చరికలను తీవ్రమైన ప్రమాద సంకేతంగా చూస్తే, మరికొందరు వాటిని అతిశయోక్తిగా భావిస్తారు. డాలర్ ప్రపంచంలో ఇంకా అత్యంత బలమైన కరెన్సీగానే కొనసాగుతోంది, ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిమాణం, ట్రేడ్, గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ స్థానం చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి డాలర్ విలువ తగ్గుతుందా? లేదా?, రానున్న రోజుల్లో ఆర్ధిక సంక్షోభం వస్తుందా? లేదా? అనే విషయాలను ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు.ఇదీ చదవండి: బంగారం ఉన్నవారికి శుభవార్త.. ఈ స్కీమ్‌తో భారీ లాభం! -
పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin)కు చెందిన అధికారిక కార్లలో అత్యంత లగ్జరీ కారు లిమోజిన్‌లో భారీ పేలుడు సంభవించింది. మాస్కో నడిబొడ్డున జరిగిన ఈ ఘటన రష్యా అధ్యక్షుని భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ ఘటనతో ప్రపంచ నేతలంతా ఉలిక్కిపడ్డారు. ‘ది సన్’ తెలిపిన వివరాల ప్రకారం పుతిన్‌కు చెందిన ఈ అత్యంత ఖరీదైన కారు లుబియాంకాలోని ఎఫ్ఎస్బీ ప్రధాన కార్యాలయం సమీపంలో కాలిపోతూ కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కారు ఇంజిన్ నుండి మంటలు ప్రారంభమై, వాహనం లోనికి వ్యాపించాయి. JUST IN: 🇷🇺 Luxury limousine from Russian President Putin's official motorcade exploded on the streets of Moscow, just blocks from the FSB headquarters.It's unclear if this is an attempted ass*ssination attempt pic.twitter.com/Da4tcUoZEU— BRICS News (@BRICSinfo) March 29, 2025అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అక్కడికి సమీపంలోని రెస్టారెంట్‌లోని సిబ్బంది కారుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో వాహనం నుండి దట్టమైన నల్లటి పొగ రావడం, కారు వెనుక భాగం దెబ్బతిడాన్ని చూడవచ్చు. ఈ పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదని, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ‘ది సన్’ పేర్కొంది. ఈ కారును ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంటుంది. ఇదిలావుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన త్వరలో చనిపోతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Ukrainian President Volodymyr Zelensky) వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన ఒక ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కారు తగలబడిన ఘటన నేపధ్యంలో ఆయన మరణాన్ని జెలెన్స్కీ ముందే ఊహించారంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. కైవ్ ఇండిపెండెంట్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యూరోవిజన్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ మాట్లాడుతూ పుతిన్ త్వరలో చనిపోతారని, ఇరు దేశాల యుద్ధం కూడా త్వరలో ముగుస్తుందని అన్నారు.ఇది కూడా చదవండి: Rajasthan Day: 19 రాచరిక రాష్ట్రాలు కలగలిస్తే.. -
ప్రసిధ్ కృష్ణ ఔట్.. ఆవేశ్ ఖాన్‌కు ఛాన్స్..!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా విండీస్‌తో రేపు (జులై 24) జరుగబోయే రెండో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిధ్య జట్టును 3 పరుగుల తేడాతో ఓడించిన ధవన్ సేన.. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం టీమిండియా తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశం ఉంది. తొలి వన్డేలో వికెట్ లేకుండా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిధ్ కృష్ణ స్థానంలో మరో పేసర్ ఆవేశ్ ఖాన్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క మార్పు మినహా తొలి వన్డేలో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించే ఛాన్స్ ఉంది. ఓపెనర్లుగా ధవన్, గిల్, వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్, మిడిలార్డర్లో సూర్యకుమార్, దీపక్ హుడా, సంజూ శాంసన్, ఆల్‌రౌండర్ల కోటాలో అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, ఏకైక స్పిన్నర్‌గా చహల్, పేసర్లుగా ఆవేశ్ ఖాన్, సిరాజ్‌లను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది. మరోవైపు తొలి వన్డేలో దాదాపు విజయపు అంచుల వరకు వచ్చిన విండీస్ సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలగా ఉంది. భారత తుది జట్టు (అంచనా).. శిఖర్ ధవన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ చదవండి: అసలు అతడికి ఇక్కడ ఏం పని? ధావన్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు! -
తడిసి ముద్దయిన రాజధాని న'గరం'!
న్యూఢిల్లీః నిన్నమొన్నటిదాకా నిప్పులు కురిపించిన దేశ రాజధాని నగరం ఢిల్లీ.. తడిసి ముద్దయింది. నల్లని మబ్బులతో చల్లని గాలులతో వచ్చిన వానజల్లులకు వాయువ్య, నైరుతి ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో ప్రజలు పులకించిపోయారు. వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరునుంచి సాధారణ వర్షాలు అనేక ప్రదేశాల్లో పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వానజల్లులతో రాజధాని నగరం తడిసిముద్దయింది. వచ్చే 24 గంటల్లో వాయువ్య , నైరుతి ఢీల్లీ ప్రాంతాల్లోని జింద్, పానిపట్, గానౌర్, కర్నాల్, రోహ్తక్ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం, తుఫాను సంభవించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. అలాగే బాగాదుర్గర్, ఝజ్జర్, ఐజిఐ విమానాశ్రయం, కోస్లీ, హసన్ పూర్ ప్రాంతాల్లో కూడ వచ్చే రెండు మూడ గంటల్లో వర్ష సూచన ఉన్నట్లు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని వాతావరణం సుమారు 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో సాధారణ మబ్బులతో కూడి ఉందని, ఈ కాలంలో ఉండాల్సిన కంటే సగటున రెండు డిగ్రీలు తక్కువగా ఉన్నట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. గరిష్ణ ఉష్ణోగ్రత సుమారు 39 డిగ్రీల సెల్సియస్ ఉండగా, ఉదయం 8.30 గంటల సమయంలో వాతావరణంలో తేమ 60 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
పొంచి ఉన్న వర్షం


