పెరుగుతోన్న యూపీఐ లావాదేవీలు | UPI Global Leap 19 Billion Transactions Monthly | Sakshi
Sakshi News home page

పెరుగుతోన్న యూపీఐ లావాదేవీలు

Sep 23 2025 11:48 AM | Updated on Sep 23 2025 11:48 AM

UPI Global Leap 19 Billion Transactions Monthly

దేశంలో యూపీఐ వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. నేడు ఏ చిన్న వస్తువు కొనాలన్నా.. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దీంతో యూపీఐ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేవలం భారత్‌లోనే కాకుండా ‍బ్రెజిల్‌, సింగపూర​్‌లోనూ వీటి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల గణాంకాల ప్రకారం ఇండియాలో ఆగస్టులో గరిష్టంగా 20 బిలియన్ లావాదేవీలు దాటినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది. ఆగస్టులో జరిగిన మొత్తం లావాదేవీలు 20.01 బిలియన్స్.. జులైలో 19.47 బిలియన్స్ కంటే 2.8 శాతం ఎక్కువ.

అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 34 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. విలువ పరంగా ఆగస్టులో యూపీఐ లావాదేవీలు రూ. 24.85 లక్షల కోట్లు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 24 శాతం ఎక్కువ అని డేటా చెబుతోంది. సగటున రోజువారీ లావాదేవీల సంఖ్య 645 మిలియన్లకు పెరిగింది. NPCI డేటా ప్రకారం రోజువారీ లావాదేవీ విలువ రూ. 80,177 కోట్లు కావడం గమనార్హం. ఆగస్టు 2న UPI ఒకే రోజులో 700 మిలియన్ లావాదేవీలను దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం ఉన్నప్పటికీ ఆగస్టులో ఈ పెరుగుదల నమోదైంది.

ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..

వివిధ దేశాల్లో యూపీఐ నెలవారీ లావాదేవీలు ఇలా..

  • యూపీఐ ఇండియాలో ప్రారంభం: 2016
    నెలవారీ లావాదేవీలు: 19 బిలియన్‌+

  • బ్రెజిల్‌లో ​ప్రారంభం: 2020
    నెలవారీ లావాదేవీలు: సుమారు 5 బిలియన్‌+

  • సింగపూర్‌లో ప్రారంభం: 2017
    నెలవారీ లావేదేవీలు: సుమారు: 0.5 బిలియన్‌+

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement