2026 పల్సర్ 220ఎఫ్: రూ.1.36 లక్షలు! | Updated Bajaj Pulsar 220F launched | Sakshi
Sakshi News home page

2026 పల్సర్ 220ఎఫ్: రూ.1.36 లక్షలు!

Jun 20 2026 4:38 PM | Updated on Jun 20 2026 5:14 PM

Updated Bajaj Pulsar 220F launched

బజాజ్ ఆటో తన పల్సర్ 220ఎఫ్ బైకును అప్డేటెడ్ ఫీచర్‌తో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ మోడల్ ధర రూ.1.36 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణ బైక్ రేటు కంటే రూ.8000 ఎక్కువ.

పల్సర్ 220ఎఫ్ బైకులో అప్డేటెడ్ ఫీచర్ ఎల్ఈడీ హెడ్‌లైట. గతంలో కంపెనీ దీనిని కొత్త గ్రాఫిక్స్, ఎల్ఈడీ ఇండికేటర్లు, కొత్త కలర్ స్కీమ్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు హాలోజన్ సెటప్‌ స్థానంలో, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (DRLs)తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్‌ను అమర్చింది.

లైటింగ్ అప్‌గ్రేడ్ మినహా, మోటార్‌సైకిల్ మెకానికల్‌గా ఎలాంటి మార్పు పొందలేదు. కాబట్టి ఇది 20.9 హార్స్ పవర్, 18.6 న్యూటన్ మీటర్ టార్క్ అందించే అదే 220 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.

బజాజ్ పోర్ట్‌ఫోలియోలోని అత్యంత పురాతన మోటార్‌సైకిళ్లలో పల్సర్ 220F ఒకటి. అయితే కంపెనీ తన కస్టమర్ల అభిరుచి మేరకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంది. కాగా కంపెనీ కొత్త జనరేషన్ పల్సర్ 125ను టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. బహుశా ఇది రానున్న రోజుల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: RE తొలి ఎలక్ట్రిక్ బైక్: డెలివరీలు షురూ!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement