
క్యాబ్ అగ్రిగేటర్ దిగ్గజం 'ఉబర్' (Uber) ముంబైలోని.. తన కస్టమర్ల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఆలస్యం కారణంగా విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం అందించనున్నట్లు వెల్లడించింది. ఈ కవరేజ్ ప్లాన్‌కు 'మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్' అని పేరు పెట్టారు. దీనితో పాటు, ఒకవేళా ప్రమాదం జరిగిన సందర్భాలలో ఔట్ పేషెంట్ (OPD) ఛార్జీలతో సహా వైద్య ఖర్చులను కూడా కంపెనీ కవర్ చేస్తుంది.
2024 ఫిబ్రవరి చివరలో ఉబర్.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ ప్లాన్‌ను ప్రారంభించారు. విమానాశ్రయానికి సకాలంలో చేరుకోవడం చాలా ముఖ్యం. అయితే నగరంలోని ట్రాఫిక్ కారణంగా కొన్ని సార్లు ఆలస్యం అవ్వొచ్చు. అలాంటప్పుడు ఈ పరిహారం వారికి కొంత ఉపశమనం అందిస్తుంది.
ఇదీ చదవండి: భారత్‌కు ఆ రెండు టెస్లా కార్లు!.. సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు
విమానాశ్రయానికి రైడ్ బుక్ చేసుకుని, ఫ్లైట్ మిస్ అయితే మాత్రమే ఈ పరిహారం లభిస్తుంది. ఉబర్ ప్లాన్ కింద పరిహారం పొందాలంటే.. రైడ్ బుక్ చేసుకున్న వ్యక్తి సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్, మిస్ అయిన ఫ్లైట్ టికెట్ కాపీతో పాటు.. మళ్ళీ కొత్తగా బుక్ చేసుకున్న కొత్త విమానం టికెట్ వంటి అవసరమైన వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.